హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేటు ఆసుపత్రులు.. హోటల్‌ రేట్లను మించకూడదు

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనూహ్యంగా పెరుగుతున్న వైద్య ఖర్చులకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటరీ ప్యానల్‌ నూతన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మెట్రో నగరాల్లోని ఆసుపత్రి గది ఛార్జీలు త్రీ-స్టార్‌ హోటల్‌ రేట్లను మించకూడదని సిఫార్సు చేసింది. అలాగే చికిత్సకు ముందుగా అంచనా వ్యయాన్ని తెలపాలని, రోగులకు సహాయం చేసేందుకు ప్రత్యేక ఆర్థిక సలహాదారులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది.