హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

AP: కడప బేసిన్ పరిధిలోని వేంపల్లె ప్రాంతంలో లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌జీఆర్‌ఐ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. రూ.140 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అలాగే గనుల రంగంలో పరిశోధన కోసం ఐఐటీ ధన్‌బాద్‌తోనూ మరో ఒప్పందం చేసుకున్నారు.