హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్దపులి మృతి.. ఆఫీసర్‌ సస్పెన్షన్‌

AP: వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలైన ఘటనను అటవీ సిబ్బంది గోప్యంగా ఉంచి దహనం చేసిన ఉదంతం కలకలం రేపింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఈ ఘటనపై ఇందిరేశ్వరం బీట్‌ ఆఫీసర్‌ మెహబూబ్‌ బాషాను సస్పెండ్ చేశారు. ఏడుగురు ప్రొటెక్షన్‌ వాచర్ల ప్రమేయంపై విచారణ జరుగుతోందని, ఫోరెన్సిక్‌ నమూనాలు సేకరించామని ఆత్మకూరు డీడీ విఘ్నేష్ అప్పావ్ వెల్లడించారు.