హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తుల ప్రయాణానికి బిగ్ రిలీఫ్

AP: తిరుపతి-తిరువణ్ణామలై రహదారి విస్తరణ కోసం ఎంపీలు గురుమూర్తి, అవినాష్‌ రెడ్డి, అన్నాదురై న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతున్నందున, ప్రయాణ సమయం తగ్గించడానికి ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఎంపీల విజ్ఞప్తిపై గడ్కరీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.