హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగు బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

AP: చిత్తూరు జిల్లాలోని జగమర్ల అటవీ ప్రాంతంలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేస్తున్న మనీష్‌ అనే కార్మికుడిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. స్థానికులు తరిమికొట్టే ప్రయత్నం చేయడంతో ఏనుగు ఎదురు తిరిగి వెనుక నుంచి దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన మనీష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు సిబ్బంది ప్రయత్నించారు.