హైదరాబాద్: 28°C
వార్తలు

'బిడ్డ ఆరోగ్యంపై తల్లులు జాగ్రత్త వహించాలి'

అన్నమయ్య: పీలేరు మండలం, గూడరేవుపల్లిలో బుధవారం మాతా- శిశు ఆరోగ్య సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష మాట్లాడుతూ.. ప్రతి బిడ్డ తొలి ప్రపంచం అమ్మ ఒడేనని అన్నారు. శిశువులను వెచ్చటి వాతావరణంలో ఉంచి, పరిశుభ్రత పాటించాలని సూచించారు. తల్లులు పోషకాహారం తీసుకుంటూ బిడ్డకు తరచూ తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు.