వార్షిక యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా భారత NCC బృందం(15 మంది) వియత్నాంలో పర్యటిస్తోంది. హనోయిలోని భారత ఎంబస్సీలో ఇవాళ రాయబారి షెర్పాతో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన వివరించారు. ఈ పర్యటనలో బృందం పలు రక్షణ, చారిత్రక ప్రాంతాలను సందర్శించనుంది. ఇది ఇరు దేశాల యువత మధ్య స్నేహబంధాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.
వార్తలు
వియత్నాంలో NCC బృందం పర్యటన


