హైదరాబాద్: 28°C
వార్తలు

తలసేమియా చిన్నారి కోసం 84వ సారి రక్తదానం!

NZB: నిర్మల్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల తలసేమియా బాధితురాలు కదం కీర్తనకు ‘ఓ పాజిటివ్’ రక్తం అవసరం కావడంతో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు నిజామాబాద్ బ్లడ్ సెంటర్‌లో 84వ సారి రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని, వారి ప్రాణాలను కాపాడేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.