హైదరాబాద్: 28°C
వార్తలు

‘దేశాన్ని అపహాస్యం చేస్తున్న రాహుల్’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రతి విషయాన్ని ఆయన జోక్‌గా తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ వందకు పైగా ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. సభను, దేశాన్ని ఆయన అవమానిస్తున్న తీరు చూస్తుంటే, ప్రతిపక్ష నేతగా రాహుల్‌కు ఇదే మొదటి, చివరి అవకాశం అవుతుందని ఆమె జోస్యం చెప్పారు.