బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ మూలాలున్న ఆయన తల్లి సోనియా గాంధీ ఒత్తిడి వల్లే విపక్షాలు రాహుల్‌ను తమ నాయకుడిగా అంగీకరిస్తున్నాయని కంగనా ఆరోపించారు. ఒకవేళ ఆ ఇటలీ తల్లి అండ లేకపోతే.. వందకు పైగా ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్ గాంధీకి సొంతంగా ఎలాంటి గుర్తింపు, స్థాయి ఉండేవి కావంటూ ఆమె తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
వార్తలు
‘ఇటలీ తల్లి వల్లే రాహుల్‌కు గుర్తింపు’


