హైదరాబాద్: 28°C
వార్తలు

బద్వేల్‌లో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం

KDP: బద్వేల్‌ రూరల్‌ పోలీసుల చొరవతో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన నల్లి తనుశ్ అనే విద్యార్థి ఆచూకీ గంటల వ్యవధిలోనే లభించింది. బుధవారం ఉదయం బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చేపట్టిన పోలీసులు కడప రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బద్వేల్‌ రూరల్‌ ఎస్‌ఐ రంగారావు ధ్రువీకరించారు.