GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని కండ్రిక, బేతపూడి, యర్రగుంట్లపాడు, గుండాలపాడు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. వినియోగదారులు అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.
వార్తలు
రేపు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


