హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం'

KMM: న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం, విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సురేష్ రామాల జ్వరం, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, పోషకాహారం, మంచి నిద్ర ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని సూచించారు.