హైదరాబాద్: 28°C
వార్తలు

'దేశ్ తిరంగా ఐక్యతపై విద్యార్థులకు అవగాహన'

BHPL: కాటారం మండలం గంగారాం మోడల్‌ స్కూల్‌లో దేశ్ తిరంగా ఐక్యత సదస్సు నిర్వహించారు. ఆర్‌వైఏ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు గడ్డం శ్రీనివాస్, జక్కుల మహేష్ విద్యార్థులకు దేశభక్తి, ఐక్యత, జాతీయ జెండా ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. నిజాయితీగా చదవడం, చట్టాలను గౌరవించడం కూడా దేశసేవేనని తెలిపారు.