KRNL: ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఇవాళ సాయంత్రం డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత నెల జరిగిన ఏసీబీ దాడులపై విచారణకు అధికారులు ఆదోని వచ్చినట్లు సమాచారం. మరోసారి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందన్న సమాచారంతో ముందుగానే దుకాణాలు మూసివేసారు. అధికారులు వచ్చేలోపే పలువురు డాక్యుమెంట్ రైటర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వార్తలు
ఏసీబీ దాడుల సమాచారంతో రైటర్ల పరుగు


