PLD: సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయి యువజన పోటీల్లో తృతీయ స్థానం సాధించాడు. ఆల్ ఇండియా గ్లాస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు దేశవిదేశాల నుంచి 2 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపిన శ్లోక్ రూ. 10,000 నగదు బహుమతిని అందుకుని పాఠశాలకు పేరు తెచ్చాడు.
వార్తలు
సత్తెనపల్లి విద్యార్థి అరుదైన విజయం


