హైదరాబాద్: 28°C
వార్తలు

“10కోట్ల మంది వ్యసన విముక్తి ప్రతిజ్ఞ”

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యసనాల నిర్మూలనపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “10కోట్ల మంది వ్యసన విముక్తి ప్రతిజ్ఞ” కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో కళాశాల ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ ప్రతిజ్ఞ చేయించారు.