హైదరాబాద్: 28°C
వార్తలు

స్మశాన వాటిక భూమిని ప్రజలకు అప్పగించాలని వినతి

కృష్ణా: గుడివాడ బాపూజీ నగర్ స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ, వెంటనే అధికారులు సర్వే నిర్వహించాలని ప్రజా సంఘాల నాయకులు,స్థానిక ప్రజలు బుధవారం డిమాండ్ చేశారు. భూమిని బాపూజీ నగర్ ప్రజలకు అప్పగించాలన్నారు. వెంకటేశ్వరరావు, సమరం, కుమార్ ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టారు. సమస్యపై రూపొందించిన మెమోరాండంను సచివాలయ సిబ్బందికి అందజేశారు.