హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరంబూరు నియోజకవర్గంలో ఆయన గెలుపును సవాల్ చేస్తూ డీఎంకే నేత శేఖర్ పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తులను తక్కువగా చూపించి నిబంధనలు ఉల్లంఘించారని అందులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 25వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సీఎం విజయ్‌ను ఆదేశించింది.