హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల పాఠశాలలో ఘనంగా క్రీడా పోటీలు

GDWL: గద్వాల్ మండలం వీరాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, గెలుపోటములు సహజమని ఆయన అన్నారు.