హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 13న ఆన్‌లైన్ జాబ్ మేళా

VZM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 13న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్. సహజ బుధవారం తెలిపారు. టాటా మోటార్స్, కియా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన పురుష అభ్యర్థులు అర్హులని, మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.