హైదరాబాద్: 28°C
వార్తలు

‘సభలో చర్చ కావాలా? గందరగోళమా?’

అత్యంత తీవ్రమైన అంశంపై కేవలం ఒక ప్రకటన చేయమనడం సరికాదని, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సభలో సుదీర్ఘ చర్చ జరగాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నను రాసుకుని, ప్రజలకు నిజాలు తెలిసేలా తాను సమాధానం చెబుతానన్నారు. విపక్షాలకు సభలో అర్థవంతమైన చర్చ కావాలా? లేక కేవలం గందరగోళం సృష్టించాలా? అనేది వారే తేల్చుకోవాలని షా చురకలంటించారు.