ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మధ్య ఆత్మీయ పలకరింపు చోటుచేసుకుంది. వేడుకలో ఎదురుపడిన ఇరువురు సరదాగా మాట్లాడుకున్నారు. 'మీరు కాస్త మారినట్లున్నారే' అని ఖర్గే అనగా.. 'నిజంగానా?' అంటూ ప్రధాని నవ్వేశారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ సైతం ఉన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి నేతలు ఇలా నవ్వుతూ పలకరించుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
వార్తలు
మోదీ, ఖర్గే మధ్య సరదా సంభాషణ


