లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపింది. ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని, PM మోదీ సభకు వచ్చి క్షమాపణలు చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. నీట్ పరీక్షపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆందోళనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది.
వార్తలు
నీట్ పేపర్ లీక్‌పై చర్చకు సిద్ధం: కేంద్రం


