హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త దొడ్డి పైడిరాజు గుండెపోటుతో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆయన కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.