హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంఈవో

ASR: డుంబ్రిగూడ మండలంలోని అడపవలస జీపీఎస్‌టీడబ్ల్యూ పాఠశాలను ఎంఈవో-2 జి. గెన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం రుచి, శుభ్రతను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులు, విద్యార్థుల చదవడం, రాయడం, లెక్కలు చేసే సామర్థ్యాలను తెలుసుకున్నారు.