హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: న్యూఢిల్లీలో బుధవారం కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్న పలు సమస్యలను వివరిస్తూ.. కేంద్రమంత్రికి ఎంపీ బైరెడ్డి శబరి వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా సమస్యల పట్ల కేంద్రమంత్రి సానుకూలంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.