హైదరాబాద్: 28°C
వార్తలు

గోదాంలో చెలరేగిన భారీ మంటలు

HYD: దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు రెండు గంటలుగా మంటలు, దట్టమైన పొగ కొనసాగుతున్నట్లు సమాచారం. రెండు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.