హైదరాబాద్: 28°C
వార్తలు

FCRA సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కీలక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు-2026ను పార్లమెంటరీ జాయింట్ కమిటీకి(JPC) పంపాలని ఆయన ప్రతిపాదించనున్నారు. ఈ సంయుక్త కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. వీరిని ఆయా సభల ప్రిసైడింగ్ అధికారులు నామినేట్ చేయనున్నారు.