హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

WGL: నర్సంపేట మండలం ఎల్లయ్యగూడెంకు చెందిన బోడ శివ విద్యుత్ షాక్‌కు గురై బుధవారం మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు శివను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృత్తిరీత్యా శివ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు.