హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలను నాటిన ఎమ్మెల్యే కడియం'

HNK: ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లిలో వనమహోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మొక్కలను నాటారు. అంతకుముందు శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుండి పెద్ద పెండ్యాల వరకు త్వరలోనే రోడ్డును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని, దేవస్థాన సమగ్రాభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.