హైదరాబాద్: 28°C
వార్తలు

పెంచలకోనకి RTGS పీపీపీ సర్వేలో ప్రథమ స్థానం

NLR: రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న మౌలిక వసతులు, దర్శన సౌకర్యాలు, ప్రసాదం నాణ్యత, త్రాగునీటి వసతి, పారిశుధ్యం తదితర అంశాలపై RTGS పీపీపీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాపూరు మండలంలోని పెంచలకోన ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆలయ ఈవో సిబ్బందిని అభినందించారు.