హైదరాబాద్: 28°C
వార్తలు

రికార్డు దిశగా చార్‌ధామ్ యాత్ర

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా.. యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 4,68,556 అధికం కావడం విశేషం. ఈ ఏడాది యాత్ర సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా సాగుతోంది.