AKP: నర్సీపట్నం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ కాలేజీ వద్ద బుధవారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. మహిళల భద్రతపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరించారు. శక్తి యాప్ వినియోగం వల్ల కలిగే లాభాలను పేర్కొన్నారు. డయల్ వన్ వన్ టూ నెంబర్ ద్వారా పోలీసులు అందించే సేవల గురించి తెలిపారు. మహిళలకు రక్షణగా పోలీస్ శాఖ ఉంటుందన్నారు.
వార్తలు
'మహిళలకు అండగా అభయ'


