TG: HYDలోని గాంధీ భవన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.
వార్తలు
గాంధీ భవన్‌లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి


