హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గత ప్రభుత్వం లో రీసర్వేలో అనేక తప్పిదాలు జరిగాయి'

NLR: ల్యాండ్ యాక్ట్ రద్దుచేసి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు తాహాసీల్దార్ కార్యాలయం వద్ద 939 మందికి పాస్ పుస్తకాలను అందజేసి 50 మంది గిరిజనులకు ఇంటి స్థలాలను అందజేశారు. ఆమన మాట్లాడుతూ.. గత రీ సర్వేలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.