లారీలు వెళ్తుంటే అందులోని చెత్త, దుమ్ము రోడ్డుపై పడి వెనకాల వచ్చే బైకర్లు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో 2027 ఏప్రిల్ 1 నుంచి అన్ని టిప్పర్లు, డంపర్లకు ఆటోమేటిక్ లోడ్ కవర్లను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనం వెళ్తుంటే ఈ కవర్లు లోడ్‌ను పూర్తిగా కప్పి ఉంచాలి. కవర్ తెరిచి ఉంటే క్యాబిన్‌లో అలర్ట్ వస్తుంది. ఇది సురక్షిత ప్రయాణానికి ఉపయోగపడనుంది.
వార్తలు
కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్


