హైదరాబాద్: 28°C
వార్తలు

ఫోన్‌తో జైలు అధికారులకు చిక్కిన ప్రజ్వల్‌

ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అగ్రహార జైలులో ఉన్న ఆయన.. తన దుస్తుల్లో ఫోన్ దాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే, పెన్ డ్రైవ్ కూడా లభ్యమైందన్నారు. దీంతో ఎలక్ట్రానిక్ పరికరాలు జైలు లోపలికి ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన జైలు అధికారిని సస్పెండ్ చేశారు.