హైదరాబాద్: 28°C
వార్తలు

విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్‌ ఫెయిల్‌

కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం రాత్రి 11 గంటలకు గాల్లో ఉండగా ఎడమ వైపు ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో అధికారులు పూర్తిస్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో మొత్తం 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా రాత్రి 11:37 గంటలకు విమానం నుంచి దిగారు. అయితే, ఇంజిన్ ఫెయిల్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.