హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 23 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 22న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకల నేపథ్యంలో ఈ నెల 22న సహస్రదీపాలంకార సేవను TTD రద్దు చేసింది. 23 నుంచి 25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 25న అష్టదళపాదపద్మారాధన సేవ, 26న కల్యాణోత్సవ సేవలను రద్దు చేసినట్లు TTD వెల్లడించింది.