SDPT: వెల్దండ(M) గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగమయ్య బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అల్లం తోట బావి తండా సర్పంచ్ రోజా అరుణ్ నాయక్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కేఎం ట్రేడర్స్ యజమాని మేడమోని మల్లేష్ యాదవ్ రూ.5 వేల సాయం చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సర్పంచ్‌కు ఆర్థిక సాయం


