హైదరాబాద్: 28°C
వార్తలు

'15లోగా పంటల బీమా ప్రీమియం చెల్లించండి'

కృష్ణా: జిల్లాలోని రైతులు ఆగస్టు 15లోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయాధికారిణి కె. జ్యోతిరమణి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.