NTR: నందిగామ పట్టణం 18వ వార్డులో మురికి నీరు నిలిచిపోయి దోమలకు నిలయంగా మారింది. వర్షాలు మొదలై నెల రోజులు గడుస్తున్నా, మున్సిపల్ అధికారులు దోమల పిచికారీ, శానిటేషన్ పనులు చేపట్టకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు కలరా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పారిశుధ్య పనులపై ప్రజల ఆందోళన


