హైదరాబాద్: 28°C
వార్తలు

రైళ్లలో విస్తృత తనిఖీలు

ATP: గుంతకల్లు ప్రయాణికుల భద్రతతోపాటు రైల్వేకు ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా ఏసీఎం ధనుంజయ్ సింగ్ నేతృత్వంలో 74 మంది సిబ్బందితో 28 రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టి 1,314 కేసులు నమోదు చేసి రూ.10,83,950 జరిమానా వసూలు చేశారు.