బాపట్ల: కర్లపాలెం మండలం ఎం.వి. రాజుపాలెంలో రెండు రోజుల నుంచి రక్షిత మంచి నీరు అందక గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిపిన సమస్య పరిష్కరించలేదని వాపోతున్నారు. మోటర్లు మరమ్మతులకు గురి అవటంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలుపుతున్నారు. మోటార్లకు మరమ్మతులు చేయించి వెంటనే త్రాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
రాజుపాలెంలో నీరు రాక ప్రజలు ఇబ్బందులు


