హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు నెలల్లోనే పాణ్యం తహసీల్దార్‌ రాజీనామా?

NDL: పాణ్యం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్ మంగళవారం రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు నెలల క్రితం కర్నూలు నుంచి పదోన్నతిపై పాణ్యం తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, తాజాగా తన రాజీనామా లేఖను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేసినట్లు తెలుస్తోంది. రాజీనామాకు కారణాలపై రెవెన్యూ శాఖలో చర్చ సాగుతోంది.