KRNL: కోసిగి మండలం తుంగభద్ర నది సమీపంలోని కందుకూరు రోడ్డుపైకి మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మొసలి పిల్ల రావడం కలకలం రేపింది. నది నీటి నుంచి కొట్టుకు రాగా, చూసిన వాహనదారులు, బాటసారులు ఫోన్లలో చిత్రాలు తీశారు. మరోవైపు వాహనాల రాకపోకల శబ్దానికి బెదిరిన మొసలి పిల్ల వెంటనే ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
వార్తలు
కోసిగిలో రోడ్డుపై మొసలి పిల్ల కలకలం


