హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ వాడకంపై నిషేధం.!

పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వాడకంపై FSSAI నిషేధం విధించింది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ లేయర్లు వాడొద్దని, ప్లాస్టిక్ రహిత పేపర్ లేదా గ్లాస్ కంటైనర్లు వాడాలని ఆదేశించింది. కేవలం ప్యాకింగ్ మెటీరియల్‌కు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని, పాన్ మసాలా ఉత్పత్తిని నిషేధించలేదని స్పష్టం చేసింది. తయారీదారులు కచ్చితంగా ఈ నిబంధనలను పాటించాలని సూచించింది.