హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో SSD టోకెన్ల నిలిపివేత

AP: తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద ఇవాళ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం దర్శనానికి టోకెన్లు ఉండవని, భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకోవాలని కోరింది. అయితే టోకెన్లు లేకపోతే దూర ప్రాంత భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.