AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఎండల వేడి తగ్గనుంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
వార్తలు
ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం


